పొరపాటు పరిహారం 40 మంది మరణం.. తమ స్వంత నౌకను తామే పేల్చివేసుకోవడంతో..

పొరపాటు పరిహారం 40 మంది మరణం.. తమ స్వంత నౌకను తామే పేల్చివేసుకోవడంతో..

ఒక పొరపాటుకు 40 మంది నావికా సైనికులు బలయ్యారు. ఇరాన్ తన స్వంత నౌకనే పేల్చి వేసుకుంది. మిస్సైల్ పరీక్షను చేపట్టిన ఇరాన్ గార్డ్స్ ఓ లాజిస్టిక్ నౌకను పేల్చి వేశారు. ఫ్రిగేట్ జమరన్ తాజాగా యాంటీ షిప్ మిస్సైల్ పరీక్ష చేపట్టింది. పొరపాటున మరొక నౌకను టార్గెట్ చేస్తూ లాక్ చేసింది. ఫ్రిగెట్‌ను వదిలిన ఇరాన్.. ఆ ప్రమాదాన్ని నిలువరించలేకపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరే చనిపోయినట్టు ఇరాన్ న్యూస్ ఏజెన్సీ చెబుతోంది.

కాగా, ఇటీవలి కాలంలో ఇరాన్‌పై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఇరాన్ నౌకలు ఏవైనా వేధించినట్లు అనిపిస్తే వాటిని వెంటనే పేల్చి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. ఈ తరుణంలో ఇరాన్ స్వయంగా తన నౌకను తానే పేల్చివేసింది. ఇంతకు ముదు జనవరిలో కూడా ఇరాన్ పొరపాటున ఉక్రెయిన్ విమానాన్ని పేల్చివేసింది. మళ్లీ ఇప్పుడు అలాంటి పొరపాటే పునారావృతమైంది.

Tags

Read MoreRead Less
Next Story