వర్షాకాలపు వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే పోరాడాలి: కేటీఆర్

వర్షాకాలపు వ్యాధుల నివారణకు ఇప్పటి నుంచే పోరాడాలి: కేటీఆర్

సీజనల్ వ్యాధుల నివారణ కోసం తెలంగాణ పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్‌. ఇందులో భాగంగా తన ఇంట్లో ఉన్న పూల కుండీలు, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు. ప్రగతి భవన్‌ ప్రాంగణంలో కలియ తిరిగిన మంత్రి కేటీఆర్.. దోమల నివారణ కోసం యాంటీ లార్వా మందును చల్లారు. రానున్న వర్షాకాలం నాటికి దోమల వల్ల కలిగే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలందరు కలిసికట్టుగా ముందుకు సాగాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story