నగరంలో మెట్రో పరుగు ఎప్పుడంటే..

నగరంలో మెట్రో పరుగు ఎప్పుడంటే..
X

కరోనా పోవట్లేదు.. మెట్రో రావట్లేదు.. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా రవాణ వ్యవస్థలో కూడా వెసులు బాటు కల్పిస్తే బావుండని ఎదురు చూస్తున్న నగర జీవికి నిరాశే ఎదురువుతోంది. కేంద్ర నిర్ణయం ప్రకారం లాక్డౌన్ 17తో ముగిసినా ఒక్కో చోట కేసులు పెరుగుతుండడంతో నెలాఖరు వరకు పొడిగించాయి కొన్ని రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు జూన్ మొదటి వారంలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. కేంద్రం నిర్ణయానికే కట్టుబడి పని చేస్తుంది మెట్రో సంస్థ.

కేంద్ర మార్గదర్శకాల మేరకే రైళ్ల రాకపోకలకు అనుమతి లభిస్తుంది. నగరంలో కేసుల తీవ్రత దృష్ట్యా ప్రజా రవాణా వ్యవస్థను ఇప్పడప్పుడే అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాగా, లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది మెట్రో సంస్థ. మెట్రో కారిడార్-2లోని నారాయణగూడ, సుల్తాన్ బజార్, కోఠి ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపడుతున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తి చేసిన తరువాత రోడ్లను జీహెచ్ఎంసీకి అప్పగిస్తామన్నారు.

Tags

Next Story