సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్

దేశంలో కరోనా మహమ్మారి అదుపు కావడంలేదు. దీంతో భవిష్యత్ కార్యాచరణపై ప్రధాని మోదీ మరోసారి ముఖ్యమంత్రులతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ సడలింపులపై అన్నిరాష్ట్రాల సీఎంలతో చర్చలు జరుపుతారు. లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి అవుతుంది.
లాక్‌డౌన్, కరోనా నియంత్రణ వంటి అంశాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆర్థిక కార్యాలపాల పున:ప్రారంభం తదితర అంశాలే కాన్ఫరెన్స్ లో ప్రధాన అజెండాగా ఉండొచ్చని తెలుస్తోంది. కరోనా ఇంకా కంట్రోల్ లోకి రానికారణంగా లాక్ డౌన్ గడువును మరింతకాలం పెంచాలా వద్దా అన్ని అంశంపై సీఎంలతో చర్చించనున్నారు మోదీ. మూడో దశ లాక్ డౌన్ ప్రకటన సందర్భంగా పలు రంగాలకు సడలింపులు కల్పించినట్లే.. రాబోయే రోజుల్లో మరిన్ని రంగాలకు, మరిన్ని సండలింపులు ప్రకటిస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com