ఆంధ్రప్రదేశ్

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు కేసు.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి

నిమ్మగడ్డ రమేష్ తొలగింపు కేసు.. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి
X

ఎస్ఈసీ పదవీకాలం కుదింపు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కేసులో ఎస్ఈసీ తరపు న్యాయవాది సోమవారం రాతపూర్వక వివరణ ఇవ్వనున్నారు. ఈ కేసులో గత శుక్రవారమే ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. అయితే..రాతపూర్వక వివరణ ఇవ్వటానికి తనకు గడువు ఇవ్వాలని ఎన్నికల కమిషనర్ కనగరాజ్ తరపు న్యాయవాది, మాజీ ఏజీ సీవీ మోహన్ రెడ్డి కోరారు. కోర్టు కూడా అభ్యర్ధనను ఆమోదించటంతో సోమవారం ఆయన రాత పూర్వక వివరణ ఇవ్వనున్నారు. దీంతో ఈ కేసులో త్వరలోనే తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనేది సర్వత్ర ఆసక్తిగా మారింది.

Next Story

RELATED STORIES