నీరవ్‌ మోదీ కేసు.. లండన్‌ కోర్టు కీలక విచారణ

నీరవ్‌ మోదీ కేసు.. లండన్‌ కోర్టు కీలక విచారణ
X

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో.. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించాలన్న పిటిషన్‌పై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు విచారించనుంది. కరోనా నేపథ్యంలో.. భౌతికదూరం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఆన్‌లైన్‌లో విచారణ చేపడుతున్నారు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు.. 2 బిలియన్‌ డాలర్లు మోసం చేసిన కేసులో... నీరవ్‌ మోదీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీరవ్‌ మోదీ గత ఏడాది అరెస్టైనప్పటి నుంచి లండన్‌లోని వాండ్స్‌వర్త్‌లో జైల్లో ఉంటున్నారు.

నీరవ్‌ మోదీ విచారణ ఐదు రోజుల పాటు కొనసాగనుంది. PNBని మోసం చేసి విదేశాలకు పారిపోయిన కేసులో.. సీబీఐ, ఈడీ ఇప్పటికే కేసులు నమోదు చేశాయి. దీంతోపాటు.. సాక్ష్యాలు తారుమారు చేయడం వంటి ఇతర అభియోగాలను కూడా సీబీఐ మోపింది. సీబీఐ కొత్తగా నమోదు చేసిన అభియోగాలపై జులైలో విచారణ జరగనుంది. భారత ప్రతినిధులు కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఫాలో అవుతారని.. బారిస్టర్‌ నిక్‌ హెర్న్ తెలిపారు. విచారణలో భాగంగా.. డైమండ్‌ వ్యాపారి నీరవ్ మోదీ సహకరించడంలేదని సమాచారం. భారత్‌ అభ్యర్థనపై.. స్కోట్‌ల్యాండ్ పోలీసులు మార్చి 19, 2019లో నీరవ్‌ మోదీని అరెస్టు చేశారు.

Tags

Next Story