రేపట్నుంచే రైలు బండి పట్టాలమీదకి.. టికెట్ కన్‌ఫాం కాకపోతే నో ఎంట్రీ

రైలు ప్రయాణీకుల రద్దీ లేదు.. రైలు కూతా లేదు నెలా పదిహేను రోజులుగా లాక్డౌన్ పాటిస్తున్న రైలింజన్ రేపు (మే 12) పట్టాలపైకి రానుంది. మే 12 నుంచి 15 వరకు ప్రయాణీకుల రైళ్లు తిరగనున్నాయని ఆదివారం రైల్వే అధికారులు ప్రకటించారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకున్న వారు మాత్రమే ప్రయాణించడానికి అవకాశం ఉంది. టికెట్ కన్‌ఫాం అయిన వారు మాత్రమే స్టేషన్‌కు రావాలని మిగతా వారు ఎవరూ స్టేషన్‌కు రావొద్దని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ఓ గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాలని అన్నారు.
కరోనా స్క్రీనింగ్ అనంతరం నెగెటివ్ అని తేలితేనే రైలెక్కనిస్తారు. లేదంటే వెనక్కి వెళ్లిపోవడమే. స్టేషన్‌లలో టిక్కెట్లను విక్రయించేది ఉండదన్నారు. ఇకపోతే తత్కాల్, ప్రీమియం తత్కాల్ వంటి సేవలు ప్రస్తుతం అందుబాటులో లేవు. సోమవారం సాయింత్రం 4 గంటల నుంచి రిజర్వేషన్ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. ప్రస్తుతం 20వేల కోచ్‌లను కోవిడ్ బాధితుల కోసం నడుపుతుంటే, 300 రైళ్లను వలస కార్మికుల కోసం నడుపుతున్నారు.
రేపటి నుంచి ప్రారంభం కానున్న రైళ్లు..
న్యూఢిల్లీ - డిబ్రఘడ్... న్యూఢిల్లీ - అగర్తలా... న్యూఢిల్లీ - హౌరా... న్యూఢిల్లీ - బిలాస్‌పూర్... న్యూఢిల్లీ - పాట్నా..న్యూఢిల్లీ - రాంచి...న్యూఢిల్లీ - భువనేశ్వర్.. న్యూఢిల్లీ - సికింద్రాబాద్...న్యూఢిల్లీ - బెంగళూరు...న్యూఢిల్లీ - చెన్నై...న్యూఢిల్లీ - తిరువనంతపురం...న్యూఢిల్లీ - మడగావ్...న్యూఢిల్లీ - ముంబై సెంట్రల్...న్యూఢిల్లీ - అహ్మదాబాద్...న్యూఢిల్లీ - జమ్మూతావి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com