రెండు రోజుల పాటు ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం మూసివేత

రెండు రోజుల పాటు ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం మూసివేత
X

ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయంలోని ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో కార్యాలయాన్ని రెండు రోజులు మగళ, బుధ వారాలు మూసివేశారు. ఆ రెండు రోజులు అక్కడ శానిటైజేషన్ పనులు చేపడతారని తెలిసింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి రకాబ్ గంజ్ రోడ్ బిల్డింగ్‌లో విధులు నిర్వహిస్తున్నాడని తెలిపింది. అతడికి కరోనా సోకిన విషయం సోమవారం సాయిత్రం తెలిసింది. ఇక కరోనా బారిన పడిన అయిదుగురు ఎయిర్ ఇండియా పైలెట్లకు తాజా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని ఎయిర్ ఇండియా ఉన్నత వర్గాలు తెలిపాయి. ఇక విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించే వందే భారత్ మిషన్‌లో పాల్గొంటున్న ఎయిర్ లైన్ ఎయిర్ ఇండియా. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది.

Tags

Next Story