ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
X

కర్నూలు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది.. డ్రోన్‌ కెమెరాల ద్వారా రెడ్‌ జోన్‌లోని ప్రాంతాల పరిస్థితిని కేంద్ర బృందం పరిశీలించింది. లాక్‌ డౌన్‌ అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలించారు కేంద్ర బృందం సభ్యులు డాక్టర్‌ మధుమిత దూబే, ప్రొఫెసర్‌ సంజయ్‌కుమార్‌. నిబంధనలను ఎలా అమలు చేస్తున్నదీ, అలాగే కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను కోవిడ్‌ ప్రత్యేక అధికారి అజయ్‌ జైన్‌, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ కేంద్ర బృందానికి వివరించారు. అటు రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌ డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా నాలుగు డ్రోన్‌ కెమెరాల పనితీరును ఫాల్కన్‌, హాక్‌ వాహనం నుంచే కేంద్ర బృందం మానిటరింగ్‌ చేసింది.. కర్నూలు నగరంలోని కొత్తపేట, పాతబస్తీ, కొండారెడ్డి బురుజు ప్రాంతాల్లో పరిస్థితులను పర్యవేక్షించారు.

Next Story

RELATED STORIES