మీ సలహాలు, సూచనలు కావాలి.. ఢిల్లీ ప్రజలకు పిలుపునిచ్చిన సీఎం కేజ్రీవాల్

దేశవ్యాప్తంగా మూడో దశ లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే.. మరి కొద్దిరోజుల్లోనే అది కూడా ముగియనుంది. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలిస్తూ.. కరోనాను ఎలా కట్టడి చేయాలి? గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ ఎలా ముందుకు నడిపించాలని ఆలోచిస్తున్నాయి. దీనిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నారు. కుప్పకూలిన ఆర్ధిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని? కరోనాను కట్టడికి వ్యూహాత్మకంగా ఎలా అడుగులు వేయాలని ఆయన అడిగారు. ఈ మేరకు ట్విటర్ వేధికగా ఓ ప్రకటన చేశారు. బుధవారం సాయంత్రం 5లోపు ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. 1031 నెంబర్‌కు కాల్ చేసి.. తమ అభిప్రాయాలు తెలపాలని.. లేదా 8800007722 నెంబర్ కు వాట్సాప్ చేయాలన్నారు. delhicm.suggestions@gmail.comకు మెయిల్ అయినా చేయొచ్చని తెలపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com