పార్శిల్ వస్తే 72 గంటలు..

కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియదు.. పార్శిల్ వస్తే పట్టుకోకండి అంటున్నారు బాత్, బిస్టల్, సౌతాంప్టన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా తెప్పించుకునే ఆన్‌లైన్ ప్యాకేజీలు 72 గంటల పాటు తెరవకుండా ఉండాలని సూచిస్తున్నారు. స్వైన్ ప్లూ విజృంభించిన రోజుల్లో ఈ సూచనలు పాటించడం సత్ఫలితాలను ఇచ్చిందని వారు చెబుతున్నారు. కాగా, కరోనా వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌పైన కరోనా వైరస్ 72 గంటలు, రాగిపై ఎనిమిది గంటలు, కార్డ్‌బోర్డ్‌పై నాలుగు గంటలపాటు బతికి ఉంటుందని శాస్ట్రవేత్తలు చెబుతున్నారు. అందుకే పార్శిల్ వచ్చిన వెంటనే హడావిడిగా ఓపెన్ చేయకుండా 72 గంటలు అంటే మూడు రోజులు ముట్టకపోవడమే బెటర్ అంటున్నారు. ఈ సూచనను తప్పకుండా పాటించాలని ప్రజలకు బ్రిటీష్ ప్రభుత్వ వెబ్‌సైట్ పేర్కొంది. అన్ని దేశాలు ఆచరిస్తే మంచిదేనేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com