సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్.. అసంతృప్తి వ్యక్తం చేసిన మమతా బెనర్జీ

ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. కరోనా కట్టడి, లాక్ డౌన్ పొడిగింపుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వలస కార్మికులు సురక్షితంగా ఇంటికి చేరేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్రాల పేర్ల ఆధారంగా ముఖ్యంత్రులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభంలోనే అభిప్రాయాలు వ్యక్తం చేసిన సీఎం జగన్..లక్ష ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, ఆదుకోవాలన్నారు. లేదంటే నిరుద్యోగం పెరుగుతందని అన్నారు. వ్యాక్సిన్ సిద్ధమయ్యే వరకు అవగాహన పెంచుకుంటూ వెళ్లాలన్నారు. వైరస్ బారిన పడివారిలో 95 శాతం నయం అవుతోందని, కరోనా పట్ల ప్రజల్లో భయాన్ని తొలగించాలని జగన్ అభిప్రాయపడ్డారు.
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీడియో కాన్ఫరెన్స్ లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగ్గా జరగటం లేదన్న ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. కరోనా కట్టడికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేంద్రం రాజకీయాలు చేయొద్దని అన్నారామె.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com