అంతర్జాతీయం

న్యూయార్క్ చిన్నారుల్లో వింత వ్యాధి.. ముగ్గురు మృతి

న్యూయార్క్ చిన్నారుల్లో వింత వ్యాధి.. ముగ్గురు మృతి
X

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్‌తో వణికి పోతున్నతరుణంలో మరో మహమ్మారి దాడి చేసి తన ప్రతాపాన్ని చిన్నారులపై చూపిస్తోంది. టాక్సి సిండ్రోమ్‌గా పిలిచే ఈ వ్యాధి కారణంగా దాదాపు వంద మంది చిన్నారులు ఆస్పత్రి పాలైతే అందులో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరి కొంత మంది కరోనా సోకిన చిన్నారులు 6వారాల తర్వాత ఈ కొత్త వ్యాధి బారిన పడుతున్నారన అధికారులు వెల్లడించారు. వ్యాధి లక్షణాలను పరిశీలిస్తే.. పిల్లల్లో జ్వరం, నీరసం, ఆకలి వేయకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలతో ఆస్పత్రిలో జాయినవుతున్నారు.

వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకురాకపోతే చిన్నారులు మరణించే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం న్యూయార్క్ రాష్ట్రంలోనే కనిపిస్తున్న ఈ వింత వ్యాధి ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో సూచించారు.

Next Story

RELATED STORIES