రోడ్డుపై ఉమ్మిన వ్యక్తితోనే క్లీనింగ్..

రోడ్డుపై ఉమ్మిన వ్యక్తితోనే క్లీనింగ్..
X

చదువుకున్న వారూ అంతే.. చదువుకోని వాళ్లూ అంతే.. మనల్ని ఎవరు చూస్తున్నారులే అని రోడ్డు మీద ఉమ్మి వేయడం. అలా ఉమ్మేసే అడ్డంగా దొరికి పోయాడు చండీగఢ్‌కు చెందిన ఓ వ్యక్తి. అసలే కరోనా ఏ రూపంలో వస్తుందో తెలియక ఎన్నో జాగ్రత్తలు తీసుకోమని చెబుతోంది ప్రభుత్వం. అందులో రోడ్డు మీద వేయకూడదన్నది కూడా ఒకటి. అయినా నాకేం పట్టదన్నట్లు ప్రవర్తించాడు. పిల్లవాడని వెంటేసుకుని బైక్ పై వెళుతూ రోడ్డు మీద ఉమ్మి వేశాడు. ఎవరూ చూడలేదనుకున్నాడు కానీ అది ఓ ట్రాఫిక్ వాలంటీర్ కంట పడింది.

అంతే అతడిని వెంబడించి మరీ పట్టుకుని ఉమ్మివేసిన ప్రాంతానికి తీసుకు వచ్చాడు. అతడి చేతే నీళ్లు పోసి కడిగించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్స్ ఇలాంటి వాలంటీర్లు అన్ని చోట్లా ఉండాలి. రోడ్లన్నీ బాగు పడతాయని అంటున్నారు. వాలంటీర్ మంచి పని చేశాడని ప్రశంసిస్తున్నారు. అయినా ఎవరైనా ఎందాక చెబుతారు. ఎవరికి వారికి అవేర్‌నెస్ రావాలి కానీ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను పాపులర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికొందరు.. ఇలా రకరకాలుగా కామెంట్ల వర్షం కురుస్తోంది.

Tags

Next Story