మల్లన్నసాగర్‌ తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో మొదటి పంప్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

మల్లన్నసాగర్‌ తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో మొదటి పంప్‌ వెట్‌రన్‌ సక్సెస్‌

మల్లన్నసాగర్‌ తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో మొదటి పంప్‌ వెట్‌రన్‌ విజయవంతం అయింది. మంగళవారం సాయంత్రం 7గంటల 45 నిముషాలకు వెట్‌రన్‌ విజయవంతమైందని.. ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రకటించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌లో మొత్తం 43 మెగావాట్ల 8 పంపులు బిగించామని వారు తెలిపారు. రోజుకు 0.8 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలమని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఒక్కొక్క పంపును వెట్‌రన్‌ చేస్తామని వారు అన్నారు.

Tags

Next Story