రానా ప్రేయసి మిహికా బజాజ్ ఎవరు.. ఎక్కడ ఉంటారు..

రానా.. తన కాబోయే భార్య మిహికా బజాజ్ అని చెప్పాడు.. మరి ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తన అభిమాన నటుడు పెళ్లి చేసుకుంటుంటే ఆ మాత్రం క్యూరియాసిటీ లేకపోతే ఎలా.. హైదరాబాద్‌కు చెందిన మిహిక ముంబైలోని రచనా సంసాద్‌లో ఇంటీరియర్ డిజైనింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్‌లో ఎంఏ పూర్తి చేశారు. ఆమె డ్యూ డ్రాప్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని నడుపుతున్నారు. Pixie Dust ఓ బ్లాగ్ కూడా నడుపుతున్నారు.
ఇక మిహిక తల్లి బంటీ బజాజ్ జ్యువెలరీ డిజైనర్. Krsala అనే బ్రాండ్‌ను స్థాపించారు. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. అమ్మపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ మిహిక.. నీలో 25 శాతం గుణాలు నాలో ఉన్నా నేను అదృష్టవంతురాలిని. లవ్ యూ అంటూ మాతృదినోత్సవం రోజు రాసుకొచ్చారు. మిహకకు సోదరుడు సమర్ధ్ ఉన్నాడు. అతడు తన తల్లికి సంబంధించిన జ్యువెలరీ ప్రొడక్షన్ చూసుకుంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com