స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ లక్ష్యం: నిర్మలా సీతారామన్

భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడమే లక్ష్యంగా 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కేటాయింపుల వివరాలు తెలిపేందుకు నిర్మలా సీతరామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ‘స్వీయ ఆధారిత భారతం’ పేరుతో ప్యాకేజీకి రూపకల్పన చేశామని.. స్వదేశీ బ్రాండ్లను తయారుచేయడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని ఆమె చెప్పారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించి ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశామని.. ఇది దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లడానికే కంకణం కట్టుకున్నారమని.. అందుకే ఈ ప్యాకేజీకి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని నామకరణం పెట్టామని అన్నారు. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలుగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశామని నిర్మలా సీతారామన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com