ఈవిడే.. నాక్కాబోయే ఆవిడ: దగ్గుబాటి రానా

X
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు. ఆయన తన ట్విట్టర్ ఖాతాలో తనకు కాబోయే భార్యతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి 'ఆమె ఒప్పుకుంది' అని తెలిపారు. ఇప్పటి వరకు రానా పెళ్లి విషయంలో ఎన్నో గాసిప్స్ వినిపించాయి. ఆ లిస్ట్‌లో హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ అవేవీ కాదంటూ ఫైనల్‌గా తన మనసులో ఉన్న అమ్మాయి ఫోటో షేర్ చేసి గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టారు. రానాని పెళ్లాడబోయే మిహికా బజాజ్ ఎవరూ ఏంటనే ఆసక్తి నెలకొంది అభిమానుల్లో. పెళ్లెప్పుడంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
