అదే జరిగితే.. కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

అదే జరిగితే.. కేసీఆర్ రాజీనామా చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభమైతే.. సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు టీసీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్. పోతిరెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఉత్తమ్ సంఘీభావం తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులెటరినీ విస్తరిస్తే.. తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టినట్లేనన్నారు. కేసీఆర్ అసమర్థత వల్లే ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ప్రారంభిస్తోందన్నారు. పోతిరెడ్డిపాడుపై ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. ఛలో పోతిరెడ్డిపాడుకు కూడా పిలుపునిస్తామన్నారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, ప్రధానిని కూడా కలుస్తామన్నారు ఉత్తమ్‌.

Tags

Read MoreRead Less
Next Story