రెచ్చిపోయిన గ్రామవాలంటీర్.. వైన్ షాపుకు వచ్చిన వ్యక్తిపై దాడి

X
By - TV5 Telugu |13 May 2020 8:10 PM IST
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులో ఓ గ్రామ వాలంటీర్ రెచ్చిపోయాడు. మందు కోసం వైన్ షాపుకు వచ్చిన వ్యక్తిపై దాడికి దిగాడు. కర్రతో ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. పక్కనే పోలుసున్నా పట్టించుకోలేదు. ఈ తతంగాన్ని అంతా చూస్తూ అలా నిలబడిపోయాడు. అసలు కర్రలతో చితకబాదే అధికారం గ్రామవాలంటీర్లకు ఎవరిచ్చారు? సమాంతర పోలీస్ వ్యవస్థను ఏమైనా నడిపిస్తున్నారా అని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఆ గ్రామవాలంటీర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com