అంతర్జాతీయం

వూహాన్ ప్రజలందరికీ కరోనా టెస్ట్..

వూహాన్ ప్రజలందరికీ కరోనా టెస్ట్..
X

కరోనా వైరస్‌ని ప్రపంచానికంతటికీ పంచిపెట్టిన ఊహాన్ నగరం కొంత కాలం వరకు పాజిటివ్ కేసులతో వణికిపోయింది. అయితే 76 రోజుల కఠిన లాక్డౌన్ అనంతరం వైరస్ వెళ్లి పోయిందనుకుని ఊపిరి పీల్చుకున్నారు ఊహాన్ వాసులు. కానీ మళ్లీ కేసులు నమోదవుతుండడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత వారం నుంచి నగరంలో కొత్తగా ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన చైనా వూహాన్ ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అందులో భాగంగా పది రోజుల్లో సుమారు 11 మిలియన్ల జనాభాను పరీక్షించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లాక్డౌన్ అనంతరం దాదాపు 28 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసూ నమోదు కాలేదు. ఇప్పుడు మళ్లీ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

Next Story

RELATED STORIES