నెల్లూరులో నిరసనకు దిగిన కరోనా ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది

నెల్లూరులో కోవిడ్-19 ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది నిరసనకు దిగారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి గేటు బయట బైఠాయించారు. తమకు 7 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, ఇలాగైతే తాము బతికేది ఎలాగంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే డ్యూటీ చేసేది లేదని తెగేసి చెప్పారు. దాదాపు 130 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నామని, కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నా తమను నిర్లక్ష్యం చేయడం దారుణమని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డుల ఆందోళనకు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. వెంటనే జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

Tags

Next Story