ఆంధ్రప్రదేశ్

ఇద్దరు సీఎంలు కూర్చొని నీటి సమస్య పరిష్కరించాలి:సీపీఐ రామకృష్ణ

ఇద్దరు సీఎంలు కూర్చొని నీటి సమస్య పరిష్కరించాలి:సీపీఐ రామకృష్ణ
X

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కృష్ణా జలాలపై చర్చించేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వీలైంనత ఎక్కువగా కృష్ణా జలాలను వినియోగించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. మనకున్న నీటి వినియోగ హక్కుల ప్రకారం.. రాయలసీమ జలశయాలు నింపేందుకు చూడటం అభినందనీయమన్నారు. కృష్ణా జలాలపై ఒత్తిడి తగ్గించేందుకే కృష్ణా - గోదావరి అనుసంధానం ఆవశ్యకమని గతంలో ప్రభుత్వాలు సూచించాయన్నారు. రెండు తెలుగురాష్ట్రాల సీఎంల మధ్య సుహృద్భావ సంబంధాలు ఉన్నందున.. నీటి సమస్యను పరిష్కరించేందుకు పూనుకోవాలని లేఖలో కోరారు రామకృష్ణ.

Next Story

RELATED STORIES