బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న రెండు రోజుల్లో..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న రెండు రోజుల్లో..
X

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరింత బలపడి పెనుతుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక బులెటిన్ విడుదల చేశారు. దీని ప్రభావం కారణంగా వచ్చే శుక్ర, శని వారాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.

Tags

Next Story