అంతర్జాతీయం

కువైట్‌లో విషాదం.. కరోనాతో కడప జిల్లా వాసి మృతి

కువైట్‌లో విషాదం.. కరోనాతో కడప జిల్లా వాసి మృతి
X

కువైట్‌లో విషాదం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లిన కడప జిల్లా నందలూరుకు చెందిన యెద్దల వేణుగోపాల్‌ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వేణుగోపాల్ మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. అక్కడ ఓ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి బారిన పడ్డ వేణుగోపాల్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సమాచారం తెలియడంతో భార్య సుహాసిని స్పృహ తప్పిపడిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలవిపిస్తున్నారు.

Next Story

RELATED STORIES