అంతర్జాతీయం

చిట్టి తల్లిని చూసి ఎన్ని రోజులైంది.. హెసన్ భావోద్వేగం

చిట్టి తల్లిని చూసి ఎన్ని రోజులైంది.. హెసన్ భావోద్వేగం
X

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ కోచ్ మైక్ హెసన్.. లాక్డౌన్ కారణంగా భారత్‌లో ఉండి దాదాపు 8 వారాల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. ఆ సందర్భంలో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. లాక్డౌన్ ఎక్కడి వారిని అక్కడే ఉంచింది. అయిన వాళ్ల మధ్య అన్ని రోజులూ ఆనందంగా గడుపుతున్న వాళ్లు కొందరైతే.. ఎన్ని రోజులు ఉండాలో తెలియక.. ఎప్పుడు తమ వారిని చేరుకుంటామో తెలియని అయోమయ పరిస్థితి మరి కొందరిది. మైక్ హెసన్ కూడా అలానే బెంగళూరులో చిక్కుకు పోయారు. లాక్డౌన్ సడలింపులతో స్వదేశానికి బయలుదేరే అవకాశం వచ్చింది.

బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో ముంబై చేరుకుని అక్కడి నుంచి విమానంలో న్యూజీలాండ్ చేరుకున్నాడు. అక్కడ 14 రోజులు స్వీయ నిర్భంధంలో ఉన్న అనంతరం తన కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన చిన్న కుమార్తెను హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హెసన్. లాక్డౌన్ సమయంలో తన ప్రయాణానికి అనుమతించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

RELATED STORIES