దుబాయ్ నుంచి వచ్చిన 20 మందికి..

లాక్డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి చేరుస్తోంది భారత ప్రభుత్వం. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు సైతం తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. అక్కడ ఫ్లైట్ ఎక్కే ముందు ఒకసారి కరోనా టెస్ట్ చేస్తారు. ఇక్కడకు వచ్చిన తరువాత కూడా మరోసారి చేస్తారు. అలా దుబాయ్ నుంచి మంగళూరుకు చేరుకున్న విమానంలో 20 మంది కరోనా పాజిటివ్ అని కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. 179 మంది ప్రయాణీకులతో స్వదేశానికి ఈ విమానంలో 38 మంది గర్భిణులు కూడా ఉన్నారు. వారందరికి కరోనా టెస్ట్ చేస్తే 20 మందికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి, మిగిలిన వారిని క్వారంటైన్‌కి తరలించారు. బాధితుల్లో 15 మంది దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com