ఆంధ్రప్రదేశ్

15 అడుగులు కంటే ఎత్తున్న హోర్డింగ్స్ తొలిగించాలి: జీహెచ్ఎంసీ

15 అడుగులు కంటే ఎత్తున్న హోర్డింగ్స్ తొలిగించాలి: జీహెచ్ఎంసీ
X

పదిహేను అడుగుల కన్నా ఎత్తు ఉన్న హోర్డింగ్స్ తీసివేయాలని అడ్వర్టైజింగ్ ఏజేన్సీలకు నోటీసులు జారీచేసింది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించి జీవో 68ని కూడా రిలీజ్ చేసింది. అసలే లాక్ డౌన్ తో రెండు నెలలుగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు జీహెచ్ఎంసీ నిర్ణయంతో తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని ఆవేదన చెందుతున్నారు ఎజెన్సీ నిర్వహాకులు. ప్రత్యక్షంగా ఇరవై వేలమంది, పరోక్షంగా పదిహేను వేల మంది.. మొత్తంగా యాభై వేలమంది వరకు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలతో ఉపాది పొందుతున్నారు. అడ్వర్టైజింగ్ రంగానికి అనుబంధంగా ఉండే ప్రింటర్స్, కాంట్రాక్టర్స్, పెయింటర్స్, వెల్డర్స్, ఎలక్ట్రీషీయన్స్ సైతం రోడ్డున పడే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ , పురపాలకమంత్రి కేటీఆర్ తమ పరిస్ధితిని అర్దం చేసుకొని నోటీసులు ఉపసంహరించేలా జీహేచ్ఎంసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి..వాళ్ల సూచనల మేరకు నడుచుకుంటామని ఔట్ డోర్ అడ్వర్టైజింగ్ మీడియా అసోసియేషన్ చెబుతోంది.

Next Story

RELATED STORIES