వాహనాలన్నీ రోడ్ల మీదే.. లాక్‌డౌన్‌ని ఒక్కరూ..

వాహనాలన్నీ రోడ్ల మీదే.. లాక్‌డౌన్‌ని ఒక్కరూ..
X

లాక్డౌన్ సడలింపులతో కొన్ని వాహనాలు, చడీ చప్పుడు లేకుండా రూటు తప్పించి గేరు మార్చి మరి కొన్ని బండ్లు రోడ్డెక్కుతున్నాయి. ఒక్కసారే అన్ని వాహనాలు.. బాబోయ్ మా వల్ల కాదు అని పోలీసులు కూడా చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు తెరుచుకోవడంతో రోడ్ల మీద వాహనాలు లెక్కకు మించి కనిపిస్తున్నాయి. లాక్డౌన్ కచ్చితంగా అమలైన 7 వారాల్లో అతి తక్కువ వాహనాలు మాత్రమే కనిపించాయి.

అత్యవసర వస్తువులకు మాత్రమే అనుమతి లభించడంతో పోలీసులు కాస్త కంట్రోల్ చేయగలిగారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కరోనా వ్యాప్తి నింబంధనలను తుంగలో తొక్కి బైకులు స్టార్ట్ చేస్తున్నారు. రోడ్ల మీద రయ్ మంటూ దూసుకుపోతున్నారు. బుధ, గురువారాల్లో దాదాపు 20 లక్షల వాహనాలు రోడ్లపై తిరిగి ఉంటాయని అంచనా. భౌతిక దూరం పాటించడం మాట అటుంచి బండి మీద ఇద్దరు, ఒక్కోసారి ముగ్గురు కూడా కూర్చుని మరీ వెళుతున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించట్లేదు. మరి వీళ్లని చూసి కరోనా ఉంటుందో.. పారిపోతుందో.

Tags

Next Story