వలస కూలీల ఆకలి వెతలు.. ఆహార పొట్లాల కోసం రైల్వే స్టేషన్లో..

వలస కూలీల ఆకలి వెతలు.. ఆహార పొట్లాల కోసం రైల్వే స్టేషన్లో..
X

నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారో ఏం తిన్నారో ఆ దేవుడికే తెలియాలి. సడలింపుల్లో భాగంగా వలస కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్నారు. ఎప్పుడు తిన్నారో ఏమో ఆకలికి అల్లాడి పోతున్నారు. దయగల మహానుభావులు ఇంత ముద్ద పెట్టక పోతారా అని ఎదురు చూస్తున్నారు. అంతలోనే రైలు దిగాడో అన్నదాత. ఎంత ఆకలి మీద ఉన్నారో ఏమో. ఒక్కసారిగా ఆయన మీద పడి పోయారు.

బిహార్ కతీహార్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పేదవారి కడుపు నింపేందుకు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ముందుకు వచ్చినా, కేంద్రం ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా పేదోడి నోటికి అది అందట్లేదు.. ఆకలి తీరట్లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు, వీడియోలు చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.. మంచి రోజులు రావాలి. మనిషికి కడుపు నిండా అన్నం దొరికే భారతావని కావాలని కామెంట్లు పెడుతున్నారు.

Tags

Next Story