వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తూ ప్యాకేజీ రూపకల్పన చేశాం: నిర్మలా సీతారామన్

కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీలో భాగంగా రెండో రోజు కేటాయింపుల గురించి ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. తాజా ఆమె చెప్పిన కేటాయింపులలో రైతులు, వలస కార్మికులు గురించి ప్రస్తావించారు. వలస కార్మికులు, వీధి వ్యాపారస్తులు, చిన్నసన్నకారు రైతుల కోసం ప్రత్యేక ప్యాకేజీకి రూపొందిచామని ఆమె తెలిపారు. గత మూడు నెలల్లో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని.. పేదలు, వలస కార్మికులు, రైతుల కోసం 9 పాయింట్ ఫార్ములాను రూపొందించినట్లు తెలిపారు. చిన్న,సన్నకారు రైతులకు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా ప్యాకేజీ ఉంటుందని .. 3 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వనున్నట్లు నిర్మల ప్రకటించారు. సకాలంలో రుణాలు చెల్లించే వారికి మే 31 వరకు వడ్డీ రాయితీ పొడిగించనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి మే 31వరకు రైతుల రుణాలపై వడ్డీ ఉండదని నిర్మల ప్రకటించడం రైతులకు ఊరట కలిగించే విషయం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com