టీవీ5 ఎఫెక్ట్.. గుంటూరు జిల్లా బ్లీచింగ్ స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్

కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లాలో వెలుగుచూసిన.. భారీ బ్లీచింగ్ స్కాంపై ఎట్టకేలకు అధికార యంత్రాంగ దృష్టిసారించింది. టీవీ5 వరుస కథనాలతో జిల్లా అధికార యంత్రంగాంలో కదలిక వచ్చింది. గుంటూరు జిల్లా కలెక్టర్ అక్రమాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కుంభకోణంపై కూపీ లాగడానికి ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. అటు జిల్లా పంచాయతీ అధికారి సైతం అన్ని పంచాయతీలకు బిల్లులు నిలుపుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల గుంటూరు జిల్లాలో భారీ స్కాం బయటపడింది. బ్లీచింగ్ పౌడర్ పేరుతో పంచాయతీలకు సున్నం అంటగడుతూ అక్రమాలకు తెరతీశారు కొందరు నాయకులు, అధికారులు. గ్రామాలు, పట్టణాల్లో శానిటైజేషన్ కోసం బ్లీచింగ్ పౌడర్‌ను సప్లై చేయాలి. ఇదే అదనుగా కొందరు నాయకులు, అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్లీచింగ్ పౌడర్‌కు బదులు సున్నం సప్లై చేసినట్లు, నాణ్యతలేని ఫినాయిల్, నాసిరకం హైపోక్లోరైట్ ద్రావణం సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఇంత జరిగినా.. అక్రమాలను అడ్డుకోవాల్సిన జిల్లా పంచాయతీ అధికారులు నిధులు విడుదల చేయాలంటూ సిఫార్సు లెటర్లు పంపించారు. బిల్లులు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీలకు.. అధికారులు ఆదేశాలు జారీచేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ భారీ స్కాంపై ఇటీవల టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో ఎట్టకేలకు జిల్లా అధికారుల్లో కదలిక వచ్చి.. విచారణ చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com