ముందు బకాయిలు చెల్లించండి.. ఆరోపణలు తర్వాత: అమెరికాపై చైనా

ముందు బకాయిలు చెల్లించండి.. ఆరోపణలు తర్వాత: అమెరికాపై చైనా
X

చైనా పేరెత్తితే చాలు చెప్పలేనంత చిరాకు వస్తోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి. కరోనా వైరస్‌కి కారణం చైనాయే. వైరస్‌ని ప్రపంచం మీదికి వదిలేసి చోద్యం చూస్తోందని చైనాపై ఆరోపణల పరంపర కొనసాగిస్తున్నారు. ఇంతకాలం ట్రంప్ మాటల్ని సహిస్తూ వచ్చిన చైనా ఇక ఊరుకునేది లేదంటూ ఓ అస్త్రాన్ని సంధించింది అమెరికాపై. ఐక్యరాజ్య సంస్థకు అమెరికా భారీగా బకాయిపడిందని ముందు దాన్ని చెల్లించి తర్వాత మాట్లాడమంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.

గత కొన్నేళ్లుగా ఐరాస సాధారణ బడ్జెట్‌కు 1.63 బిలియన్ డాలర్లు, శాంతి స్థాపన కార్యక్రమ బడ్జెట్‌కు 2.14 బిలియన్ డాలర్లు అని పేర్కొంది. ఇప్పటి వరకు అత్యధికంగా బకాయిపడ్డ దేశం అమెరికా అని చైనా తన ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా ఆరోపణల్ని అమెరికా తిప్పి కొట్టింది. వైరస్ వ్యాప్తి విషయంలో దోషిగా ఉన్న చైనా అమెరికా విమర్శలు గుప్పిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

ఇదిలా ఉంటే ఐరాస బడ్జెట్‌కు అత్యధికంగా నిధులు సమకూర్చేది అమెరికానే. ఏటా దాదాపు 3 బిలియన్ డాలర్లు అందిస్తుంది. శాంతి స్థాపన కార్యక్రమాలకు 25 నిధులు అగ్రరాజ్యమే సమకూరుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికా 27.89 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, ట్రంప్ అధికారంలోకి వచ్చాక దాన్ని 25 శాతానికి కుదిస్తూ చట్టం తీసుకువచ్చారు.

Tags

Next Story