ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు.. గర్భం రావడంతో..

నెల్లూరులో దారుణం.. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగుడు.. గర్భం రావడంతో..
X

ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగడుతూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బాలికపై అత్యాచారం కలకలం రేపుతోంది. స్థానికంగా ఓ బట్టల షాపులో పని చేస్తున్న మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడో మృగాడు. తల్లిదండ్రులకు చంపేస్తానని బెదిరిస్తూ కొంత కాలంగా ఆ అమాయకురాలిపై దుర్మార్గానికి ఒడిగడుతున్నాడు.

బాలిక గర్భవతి అయిన తర్వాత ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాలికకు 9వ నెలగా తెలుస్తోంది. రేపో మాపో కాన్పుకు సిద్ధంగా ఉందా అమ్మాయి. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES