ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నంలో వలస కార్మికుల మెరుపు ధర్నా

విశాఖపట్నంలో వలస కార్మికుల మెరుపు ధర్నా
X

విశాఖపట్నం ఎల్‌‌ అండ్‌ టి సంస్థలో పనిచేస్తున్న జార్ఖండ్‌, బీహార్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిషా రాష్ట్రాల వలస కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దాదాపు 1863 మంది కార్మికులు తమను స్వరాష్ట్రాలకు పంపాలంటూ... గంగవరం, పెద గంట్యాడ రోడ్‌పై బైఠాయించారు. పోలీసులతో ఘర్షణపడి అక్కడి నుంచి పెద గంట్యాడ జంక్షన్‌ వరకు పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న MRO సత్యనారాయణ, హార్బర్‌ ఏసీపీ కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గ్రామాలకు తరలించేందుకు జిల్లా యంత్రాంగం జాబితా తయారు చేసిందని.. వారంలోగా పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES