11 రకాల వైరస్‌లను 2 నిమిషాల్లో అంతం చేసే యంత్రం

11 రకాల వైరస్‌లను 2 నిమిషాల్లో అంతం చేసే యంత్రం

11 రకాల వైరస్‌లను కేవలం 2 నిమిషాల్లో అంతం చేసే యంత్రాన్ని తయారు చేసింది హైదరాబాద్‌కు చెందిన రోవా ఫార్మా. యూవీ రోవా పేరుతో రోబోను ఆ సంస్థ లాంచ్‌ చేసింది. తొలిసారి భారత్‌లో దీన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. హాస్పిటల్స్‌ గదుల్లో ఇన్ఫెక్షన్లకు చెక్‌ పెట్టొచ్చని తెలిపారు. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ ఉండవని స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story