హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. భయంతో జనం పరుగులు

హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుభాష్ నగర్ లో మూడు స్క్రాఫ్ గోడౌన్ లల్లో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెండు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. అందులోని సరుకంతా బుగ్గిపాలైంది. గోడౌన్లు జనావాసాల మధ్య ఉండటంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. మంటలు ఎగిసిపడటంతో జనం భయంతో పరుగులు తీశారు. షాట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఇక్కడినుంచి వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story