రైలు చార్జీలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది: మమతా బెనర్జీ

రైలు చార్జీలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది: మమతా బెనర్జీ
X

పలు రాష్ట్రాల్లో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కార్మికుల రైల్వే ఛార్జీలు రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. శ్రామిక్ రైళ్లలో వచ్చే వలస కూలీలు ఎవరు కూడా రైల్వే చార్జీల కోసం సొంత డబ్బులు పెట్టాల్సిన అవసరంలేదని తెలిపారు. ఇదే విషయం రైల్వే బోర్టు చైర్మన్ కు కూడా లేఖ రాసి తెలియజేశారు. బెంగాల్ రాష్ట్ర వలస కూలీల కోసం నడిపించే రైళ్లకు పూర్తిగా చార్జీలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని లేఖలో తెలిపారు. రైళ్లు ఎక్కే స్టేషన్లలో టికెట్ ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ని కోరారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రలతో పోలిస్తే.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్కువ రైళ్లకు అనుమతినిస్తుందని బీజేపీ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో మమత ఈమేరకు ప్రకటించారు.

Tags

Next Story