వలస కూలీల కోసం 40వేల కోట్లు కేటాయిస్తున్నాం: నిర్మలా సీతారామన్

వలస కూలీల కోసం 40వేల కోట్లు కేటాయిస్తున్నాం: నిర్మలా సీతారామన్
X

ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ వివరాలను గత ఐదు రోజులుగా కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నారు. కేటాయింపుల్లో బాగంగా ఐదో రోజుల మరిన్ని వివరాలు ప్రకటిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కొత్తగా 40 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రటించారు. సొంత ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలను ఉపాధి హామీ పథకంలో భాగం చేసేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతోందని ఆమె తెలిపారు. గతంలో నరేగా కు కేటాయించిన మొత్తం నిధులు ఈ 40 వేల కోట్లు అదనమని.. దీంతో నరేగా కేటాయింపులు 61వేల కోట్లుకు చేరిందని ఆమె తెలిపారు. ఆర్థికశాఖ సహాయకమంత్రి అనురాగ్ ఠాకూర్ తో కలిసి నిర్మలా సీతారామన్ ఈ వివరాలను వెల్లడించారు.

Tags

Next Story