ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రజలకు ఊరట.. బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రజలకు ఊరట.. బస్సు సర్వీసులకు గ్రీన్ సిగ్నల్
X

ప్రజలకు కాస్త ఊరట లభించబోతోంది.. ఎప్పుడెప్పుడు బస్సులు రోడ్డెక్కుతాయా.. తమ సొంత ఊళ్లకు ఎప్పుడు వెళ్తామా అని ఎదురుచూస్తున్న వారికి ఊరట కలిగించే అంశమిది.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో ప్రగతి రథ చక్రాలను రోడ్డెక్కించడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.. బస్సుల్లో ప్రయాణానికి పలు ఆంక్షలు ఉండగా.. సామాజిక దూరం కోసం సీట్ల సర్దుబాట్లు వేగంగా జరుగుతున్నాయి.

అటు ప్రైవేటు బస్సులకు కూడా అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ మాత్రమే బస్సు సర్వీసులను నడపాలని.. మధ్యలో ఎక్కేందుకు అనుమతి లేదని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక బస్సు ఎక్కిన ప్రయాణీకుల పూర్తి వివరాలను సేకరించాలని.. వారు బస్టాండులో దిగగానే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని అధికారులు వెల్లడించారు.

మరోవైపు 50 శాతం సీట్లు మాత్రమే నింపాలని.. ప్రతీ బస్సుకు 20 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు ప్రైవేట్ వాహనాల్లో ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. కాగా, బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయనేది మాత్రం నాలుగు రోజుల్లో ప్రకటించనున్నారు.

Next Story

RELATED STORIES