రైట్.. రైట్.. రాష్ట్రంలో రేపటి నుంచే బస్సులు రోడ్లపైకి..

రైట్.. రైట్.. రాష్ట్రంలో రేపటి నుంచే బస్సులు రోడ్లపైకి..
X

దాదాపు రెండు నెలలు.. లాక్డౌన్ పేరుతో అన్ని రవాణా సర్వీసులు మూత పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించనుంది. కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సులను నడపాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు సోమవారం సాయింత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. బస్సులు నడిపే సమయంలో అనుసరించ వలసిన చర్యల గురించి, ప్రయాణీకుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని పరిమిత సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించుకుంటోంది.

రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ అధ్యక్షతన ఆర్టీసీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు ప్రారంభిస్తారు. కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో కార్యాలయాలు కూడా దాదాపుగా తెరుచుకోవడంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురికాకుండా ఆర్టీసి తగు చర్యలు చేపట్టనుంది. కంటెయిన్‌మెంటు జోన్లు మినహా గ్రామీణ, జిల్లా, రాజధానికి నడిపే బస్సుల్లో పరిమిత ప్రమాణీకులను అనుమతిస్తారు.

దాంతో పాటు వ్యక్తిగత దూరం పాటించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్‌మెంట్ చేసినట్లు తెలుస్తోంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడిపే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించన విషయాలు కూడా మంత్రి మండలిలో చర్చించే అవకాశం ఉంది.

Tags

Next Story