తీవ్రరూపం దాల్చిన 'అంఫన్' తుఫాన్

అసలే కరోనా మహమ్మారి వణికిస్తుంటే.. ఇప్పుడు తుఫాన్ రూపంలో మరో ముప్పు భయపెడుతోంది. అంఫన్ తుఫాన్ అత్యంత తీవ్రరూపం దాల్చింది. ఉత్తర దిశగా కదులుతూ.. ఈనెల 20 మధ్యాహ్నానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం వున్నట్టు వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 879 కిలోమీటర్ల దూరంలో.. దిఘాకు దక్షిణ నైరితు దిశగా వెయ్యి 20 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. సముద్రంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఓడరేవుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అటు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com