ఆంధ్రప్రదేశ్

పూజలు చేస్తానని.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దొంగ పూజారి

పూజలు చేస్తానని.. బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దొంగ పూజారి
X

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రుద్ర సముద్రంలో దారుణం జరిగింది. కామంతో కళ్లుమూసుకుపోయిన దొంగ పూజారి ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన గోన బాలరాజు, సుజాత దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో విడివిడిగా వుందామంటూ భర్త బాలరాజు పలుమార్లు తన భార్యపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో తన భర్తకేమైనా గాలి సోకిందేమోనని అనుమానించిన సుజాత.. పూజారిని సంప్రదించింది.

ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు ఇంట్లోనే పూజ చేయాలని పూజారి సూచించడంతో.. అతనికి ఇంట్లోనే ఓ గదిని కేటాయించారు. అయితే పూజల నెపంతో తన గదిలోకి ఎవరూ రావొద్దని.. ఆ ఇంట్లోని చిన్న పాపను మాత్రమే పంపించాలని కండిషన్ పెట్టిన పూజారి.. ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని సుజాత మేనల్లుడు గమనించడంతో పూజారి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో దొంగపూజారిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. అనంతరం పోలీసులకు అప్పగించారు.

Next Story

RELATED STORIES