విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరిచిపోకముందే.. తూర్పు గోదావరిలో గ్యాస్ లీకేజీ కలకలం

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరిచిపోకముందే.. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఐస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ భయాందోళనలకు గురిచేసింది. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం ఐస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయ్యింది. ఫ్యాక్టరీలో మొత్తం 10 సిలిండర్ల అమ్మోనియం గ్యాస్ నిలువ వుంది. వీటిలో మూడు సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. ఒక్కో సెంటర్లో 50 కిలోల అమ్మోనియం గ్యాస్ వుంది. అధికారులు వేగంగా స్పందించి లీకేజీని అరికట్టడంతో ప్రమాదం తప్పింది.
ఓఎన్జీసీతో పాటు ఇతర శాఖల సహకారంతో లీకేజీని అదుపు చేశారు అధికారులు. అమలాపురం డీఎస్పీ షేక్ మషూమ్ బాషా సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వాటర్ అంబరిల్లా విధానంతో కొన్ని గంటల్లోనే పూర్తిస్థాయి చర్యలు చేపట్టి సమాన్య పరిస్థితికి తీసుకువస్తామన్నారు. ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దన్నారు డీఎస్పీ బాషా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com