బంగారం బాగా కొనేస్తున్నారు.. అందుకే రేటు భారీగా..

కరోనా ప్రభావం కనకం మీద పడి రేటు భారీగా తగ్గుతుందనుకుంటే.. అలాంటిదేమీ లేదు మనం ఎప్పుడూ కింగే.. నేను బంగారాన్ని.. అలా ఎలా తగ్గుతాను అని భారీగా పెరిగి పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అంతకంతకూ పెరగడంతో ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. అమెరి, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలు, మరో వైపు క్షీణిస్తున్న ఆర్ధిక వ్యవస్థ.. ట్రేడర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో బంగారం ధర భారీగా పెరిగి సోమవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,961 వద్ద ట్రేడ్ అవుతున్నది. ఇంక వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.48,999 గా ట్రేడ్ అవుతున్నది. 2012 అక్టోబర్ తర్వాత బంగారం ధర అత్యధికంగా పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ప్రపంచ మార్కెట్లో బంగారం ధర 16 శాతం పెరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com