బ్రేకింగ్.. తెలంగాణలో టెన్త్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

X
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 8 నుంచి నిర్వహించుకో వచ్చని స్పష్టం చేసింది. జూన్ 3న పరీక్షల నిర్వహణపై సమీక్షించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4న ఈ పరీక్షలపై పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు. ప్రతి పరీక్షకు మధ్య రెండ్రోజుల వ్యవధి ఇవ్వాలని, పరీక్షా కేంద్రాలను సైతం రెట్టింపు చేయాలని ఆదేశించింది. ఇక ఎగ్జామ్ సెంటర్లలో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, విద్యార్ధుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
