ఆంధ్రప్రదేశ్

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ సమావేశాలు

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ సమావేశాలు
X

బెజవాడ దుర్గమ్మ సన్నిధిని రాజకీయ సమావేశాలకు వేదికలా మార్చేశారు అధికార పార్టీ నాయకులు. జమ్మిదొడ్డిలో మంత్రి వెల్లంపల్లి.. కార్పొరేట్ అభ్యర్థులతో రాజకీయ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో మంత్రి వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడమేంటని బెజవాడవాసులు భగ్గుమంటున్నారు. రాజకీయ సమావేశంపై దుర్గ గుడి ఈవో సురేష్ సమాధానం ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అటు దుర్గమ్మ సన్నిధిని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES