డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్

తొమ్మిది దేశాలతో పాటు భారత్ కు కూడా డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డులో చోటు లభించిన విషయం తెలిసిందే. అయితే, బోర్డు చైర్మన్ గా భారత్ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ నియమితులయ్యారు. దీంతో ఇప్పటివరకూ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ గా ఉన్న జపాన్ కు చెందిన డాక్టర్ హిరోకి నకటాని స్థానంలో హర్షవర్థన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 22న జరగనున్న బోర్డు మీటింగ్ లో బాధ్యతలు చేపడతారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు మూడేళ్లకు ఒకసారి ఎన్నికవుతోంది. బోర్డు చైర్మన్ పదవి కూడా మూడేళ్లు పాటు ఉంటుంది. అయితే.. చైర్మన్ పదవి పూర్తికాలం అసైన్మెంట్ కాదు. కేవలం బోర్డు సమావేశాల్లో చైర్మన్ అందుబాటులో ఉంటే సరిపోతుంది. బోర్డు సంవత్సరంలో రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. జనవరిలో, మేలో ఈ సమావేశాలు జరుగుతాయి. డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలను అమలుచేసే బాధ్యత బోర్డు సభ్యులపై ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com