వ్యాక్సిన్‌తో పనేముంది.. మందు కనిపెట్టేశాం: చైనా

వ్యాక్సిన్‌తో పనేముంది.. మందు కనిపెట్టేశాం: చైనా

కరోనా వైరస్‌ని తరిమి కొట్టాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అంటున్నారు. మరి అది ఇప్పట్లో వస్తుందా అంటే అదీ చెప్పలేమంటున్నారు. మొత్తానికి చాలా విశ్వవిధ్యాలయాలు అదే పని మీద ఉన్నాయి. కానీ చైనా మాత్రం వ్యాక్సిన్ కంటే ముందు ఈ మందు వేసుకుంటే కరోనా వైరస్ కంట్రోల్‌‌లోకి వస్తుందంటున్నారు. చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ ఔషధం కరోనా సోకిన వ్యక్తని త్వరగా కోలుకునేటట్లు చేస్తుంది. దాంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుందని అంటున్నారు.

జంతువులపై ప్రయోగించిన ఈ డ్రగ్ విజయవంతమైందని బీజింగ్ అడ్వాన్స్‌డ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ జెనోవిక్స్ డైరెక్టర్ సన్నీ క్సీ చెప్పారు. సైంటిఫిక్ జర్నల్‌లో పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ప్రచురించారు. తమ బృందం పగలు రాత్రి కరోనా ఔషధం కోసం పనిచేస్తోందని సన్నీ వివరించారు. ఈ ఏడాది చివరికల్లా ఔషధాన్ని తీసుకువస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4.8 మిలియన్ల మందికి వైరస్ సోకగా అందులో 3,15,000 మంది మరణించారు.

వైరస్ వ్యాప్తి శీతాకాలంలో ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. కాగా, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మేము వ్యాక్సిన్ లేకుండానే కరోనా మహమ్మారిని కట్టడి చేసే మందును కనిపెడుతున్నాము అని సన్నీ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story