1999 తరువాత వస్తున్న రెండో అతిపెద్ద తుఫాన్ ఇదే!

ఆంఫన్ తుఫాన్ తీరంవైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెను తుఫాన్ పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆంఫన్ తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముప్పు పొంచి ఉండడంతో.. తీర ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది బెంగాల్ ప్రభుత్వం. ఎప్పటికప్పుడు తుఫాన్ సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్న సీఎం మమతా బెనర్జీ.. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. 1999 తరువాత వస్తున్న రెండో అతిపెద్ద తుఫాన్ ఇదేనని హెచ్చరిస్తున్నారు భారత వాతావరణ శాఖ అధికారులు.
మరోవైపు కేంద్ర ఎప్పటికప్పుడు తుఫాన్ సహాయ చర్యలపై పర్యవేక్షిస్తున్నారు హోంమంత్రి అమిత్‌షా. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడిన ఆయన.. కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలనైనా అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com